మేక పాట వస్తోంది.. కాస్కోండి !

అల్లు అర్జున్ – సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన కథానాయిక. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో, రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలోని ‘దాక్కో దాక్కో మేక…’ పాటని శుక్రవారం విడుదల చేస్తున్నారు.
ఐదు భాషల్లో పాట విడుదల కానుంది. తెలుగులో శివం, హిందీలో విశాల్ దడ్లాని, కన్నడంలో విజయ ప్రకాష్, తమిళంలో బెన్నీ దయాల్, మలయాళంలో రాహుల్ నంబియార్ పాటని ఆలపించారు. ఈ మేక పాటతో పుష్ప పార్ట్ 1పై అంచనాలు పెరిగిపోనున్నాయ్. ‘పుష్ప’ తొలి భాగాన్ని క్రిస్‌మస్ సందర్భంగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.