‘ఏజెంట్’ యాక్షన్ హైలైట్

అఖిల్ అక్కినేని మరో మహేష్ బాబు అవుదాం అనుకున్నాడు. ప్రేక్షకులు కూడా అందుకు అఖిల్ కి అర్హత ఉందని చెప్పుకున్నారు. కానీ తొలి సినిమా అఖిల్ అట్టర్ ప్లాప్ కావడంతో.. సీన్ రివర్స్ అయింది. మరో మహేష్ బాబు అనిపించుకోవడం పక్కనపెడితే.. నటుడిగా నిలదొక్కునే పనిలో ఉన్నారు. అఖిల్ నాల్గో సినిమా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ బొమ్మరిల్లు దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాని మొదలెట్టాడు అఖిల్. స్టయిలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న చిత్రం ఏజెంట్. ఇప్పటికే సిక్స్ ప్యాక్ బాడీతో కూడిన అఖిల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. సినిమాని హాలీవుడ్ రేంలో యాక్షన్ అదిరిపోయేలా ప్లాన్ చేశారట. హాలీవుడ్ ఫైట్ మాస్టర్లతో కంపోజ్ చేయించిన యాక్షన్ ఎపిసోడ్స్, విదేశాల్లోనే చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. 15 నిమిషాల పాటు సాగే ఒక ఛేజింగ్ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో అఖిల్ కి జంటగా సాక్షి వైద్య కనిపించనుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.