బీజేపీలో ఎందుకు చేరానా.. ? ఏడుస్తున్న ఈటల !
భూ ఆక్రమణ నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి బయటికొచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థిగా హుజురాబాద్ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఇప్పటికే సొంత నియోజవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రజాదీవెన పేరుతో పాదయాత్ర చేశారు. అయితే అనారోగ్యం కారణంగా పాదయాత్రకు బ్రేక్ ఇచ్చినా.. సభా-సమావేశాల్లో పాల్గొంటున్నారు. అయితే ఆయనకు బీజేపీ నుంచి సహకారం కరువైంది. బీజేపీ హైకమాండ్, రాష్ట్ర నేతలెవ్వరు ఈటలకు సహకరించడం లేదు.
తెలంగాణలో బీజేపీలో వర్గపోరు నడుస్తోంది. రెండు, మూడు వర్గాలుగా విడిపోయింది. వీటిలో ఓ వర్గం సీఎం కేసీఆర్ కు తొత్తుగా మారింది. ఆయనతో కలిసి హుజురాబాద్ ఉపఎన్నిక వాయిదా కోసం ప్రయత్నిస్తొంది. ఈ నేపథ్యంలో ఈటల నెత్తిపట్టుకుంటున్నాడు. ఎందుకు బీజేపీలో చేరానా ? అని బాధపడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఏడుస్తుండు. సన్నిహితులకు ఫోన్ చేసి.. తన బాధని వెల్లగక్కుతున్నడు. బీజేపీలో తనకు ఎవరు సహకరించడం లేదు. సహాయనిరాకరణ చేస్తున్నారని వాపోయాడని సమాచారమ్.
బీజేపెలో ఈ రేంజ్ లో వర్గ విబేధాలు పెట్టుకొని టీఆర్ ఎస్ ని ఎలా ఢీకొంటారు. టీఆర్ ఎస్ కి ప్రత్యామ్నాయంగా మారతారు? ఎలా అధికారంలోకి వస్తారు ?? అంటూ ఈటల ఆశ్చర్యం, అసహనం వ్యక్తం చేస్తుండు. దీంతో.. వ్యక్తిగత ఇమేజ్ తోనే హుజురాబాద్ లో ప్రచారం చేసుకుంటున్నడు. ఇక త్వరలోనే కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా హుజురాబాద్ లో పర్యటించనున్నారు. ఆయన పర్యటనతోనైనా పార్టీ వైఖరి మారుతుందని.. తనకు సహరిస్తారని ఈటల ఆశపడుతుండు.