రాధికా ఆప్టేకు మరోసారి ‘పార్చ్‌డ్’ సెగ
బాలీవుడ్ నటి రాధికా ఆప్టేకు వెంటనే పరిశ్రమ నుంచి బహిష్కరించాలని.. ఆమె నటించిన సినిమాలు అస్సలు చూడకూడదని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను వ్యతిరేకంగా చూపించే చిత్రాల్లో రాధిక నటిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో #BoycottRadhikaApte అనే హ్యాష్‌ట్యాగ్ తాజాగా ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది.
రాధికపై నెటిజన్ల ఆగ్రహానికి కారణమేంటంటే.. స్త్రీ విద్య, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేస్తూ తెరకెక్కిన ‘పార్చ్‌డ్’లో ప్రధాన పాత్ర పోషించారు. 2016లో ఆ సినిమా విడుదలై విమర్శలు ఎదుర్కొంది. అశ్లీల సన్నివేశాల్లో రాధిక నటించడం పట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ‘పార్చ్‌డ్’ నుంచి కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఇటీవల నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లు.. రాధికని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.