హుజురాబాద్ : షాక్ ఇస్తున్న ముందస్తు సర్వేలు
ఎన్నికల వ్యూహాలు రచించడంలో సీఎం కేసీఆర్ దిట్ట. అసలు ప్రత్యర్థులకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా దూసుకుపోతుంటాడు. ప్రత్యర్థులు పసిగట్టే లోపే పని కానిచ్చేస్తాడు. ఇప్పుడు హుజురాబాద్ ఉపఎన్నిక కోసం కేసీఆర్ తనదైన శైలిలో వ్యూహాలు అమలు చేస్తున్నారు. ‘దళిత బంధు’ లాంటి సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చారు. అభ్యర్థి ఎంపికలోనూ తనదైన వ్యూహాం అమలు చేశారు. ఇతర పార్టీల నుంచి పేరు మోసిన నేతలని పార్టీలో చేర్చుకున్నారు. వారిలో ఎవ్వరికి సీటు ఇవ్వకుండా.. ఉద్యమ నేపథ్యం ఉన్న బీసీ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ ని అభ్యర్థిగా ప్రకటించారు. ఈటలకు బారాబర్ గెల్లు అన్నట్టుగా ఈక్వెషన్ సెట్ చేశారు.
ఇక ఇప్పుడు ముందస్తు సర్వేలని తెరపైకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా సర్వేలు మనకే అనుకూలం. వందశాతం మనమే గెలవబోతున్నాం అని పార్టీ శ్రేణులు భరోసా నింపుతారు. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా సర్వేలు మాకే అనుకూలమని కేసీఆర్ ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో యువ సత్తా చాటి గులాబీ జెండాను ఎగురవేయాలని సూచించారు. టీఆర్ఎస్‌పై ప్రజాభిమానాన్ని తెలియజెప్పేందుకు వచ్చిన చక్కని అవకాశమే హుజూరాబాద్ ఉప ఎన్నిక అని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.