రసవత్తరంగా రెండో టెస్ట్
లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 400+ స్కోరు చేస్తుందని భావించిన టీమిండియా 364కే పరిమితమైంది. ఓవర్‌నైట్ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ఆరంభించిన కోహ్లీసేన వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుంది. కేఎల్ రాహుల్ (129), అజింక్య రహానె (1) వెంటవెంటనే ఔటయ్యారు.
రిషభ్ పంత్ (37), రవీంద్ర జడేజా (40) కాసేపు పోరాడారు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కెప్టెన్ జోరూట్ (48* బ్యాటింగ్; 75 బంతుల్లో 6×4) అర్ధశతకానికి చేరువయ్యాడు. అతడికి జానీ బెయిర్‌స్టో (6* బ్యాటింగ్) తోడుగా ఉన్నాడు. భారత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 2, మహ్మద్ షమి ఒక వికెట్ తీశారు.