మా పాలిటిక్స్ లో మరో మలుపు

మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్) పాలిటిక్స్ లో మరో మలుపు. మరికొద్దిసేపట్లో ‘మా’లోని కొందరు సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. నటి హేమ, మరికొందరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారని సమాచారమ్. ఇటీవల మా అధ్యక్షుడుపై హేమ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

మా అధ్యక్షుడుని తొలగించేందుకు ఆమె సంతకాల సేకరణకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ పరిణామాలు సినీ పెద్దలకు చిరాకు తెప్పించాయి. దీనిపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. ‘మా’ పరువుకు భంగం కలిగేలా ప్రవర్తించేవారిపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు, సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజుకు లేఖ రాశారు.

ఈ నేపథ్యంలోనే మాలోని కొందరు మీడియా ముందుకు రానున్నారని తెలుస్తోంది. మా పరువు తీసేలా ప్రవర్థిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్టు తెలుస్తోంది. ఇక త్వరలోనే జరగనున్న మా ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ, ఏవీఎల్ నరసింహారావు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికిప్పుడే ‘మా’ బాడీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఓ వర్గం కోరుతోంది. మరోవర్గం మాత్రం తొందరెందుకు అన్నట్టుగా ప్రవర్థిస్తోంది.