ఆచార్య తొలి రికార్డ్

సినిమా లెక్కలు మారాయ్. టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ నుంచే రికార్డులకి తెరలేస్తోంది. పాటలు, టీజర్, ట్రైలర్ రికార్డ్ సృష్టిస్తున్నాయి. రికార్డ్ వ్యూస్ సంపాదిస్తున్నాయి. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

త్రివిక్రమ్-అల్లు అర్జున్’ల ‘అల.. వైకుంఠపురంలో’ని పాటలు సృష్టించిన ప్రభంజనం గురించి తెలిసిందే. ఒక్కదానిని మించి మరో పాట హిట్టయింది. టన్నుల కొద్ది లైకులు, షేర్లు వచ్చిపడ్డాయి. ఆ రికార్డుల ప్రవాహం మొన్నటి వరకు కొనసాగింది. ఇప్పుడు ‘ఆచార్య’ కూడా తొలి పాటతోనే తొలి రికార్డ్ కొట్టాడు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న ఆచార్య సినిమా నుంచి తొలి సాంగ్ ‘లాహే.. లాహే’ రిలీజైంది. ఇప్పుడీ.. ఈ పాట యూట్యూబ్ లో దూసుకుపోయింది. ఇంతవరకు ఈ సాంగ్ 80 మిలియన్ల వ్యూస్ ను రాబట్టింది. ‘ఆచార్య’ ఖాతాలో తొలి రికార్డుని నెలకొల్పింది.

ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం. ఆచార్య ఇంకా రిలీజ్ డేటుని ఖరారు చేసుకోలేదు. అక్టోబర్ 13న రానున్న ఆర్ఆర్ఆర్ వాయిదా పడితే.. ఆ డేటుని ఆక్రమించుకోవాలనే ప్లాన్ లో ఆచార్య ఉన్నట్టు సమాచారమ్. లేదంటే.. వచ్చే యేడాది సమ్మర్ వరకు ఆగాల్సిందే. ఎందుకంటే.. ? ఇప్పటికే సంక్రాంతి సీజన్ నిండిపోయింది.