గాంధీ రేప్ ఘటన.. షాకింగ్ ట్విస్ట్ !

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ జరిగింది. చికిత్స కోసం హాస్పటల్ కి వచ్చిన ఇద్దరు అక్కా చెల్లెలని ఉమామహేశ్వరరావు అనే టెక్నిషన్ స్నేహితులతో కలిసి దారుణానికి పాల్పడ్డాడు అనే కథనాలు వెలువడ్డాయి. పోలీసులు ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకున్నారు. విసృతంగా తనిఖీలు చేశారు. ఫైనల్ గా ఇదో కట్టుకథని పోలీసులు తేల్చారు.

ఈ ఘటనపై సీపీ అంజనీకుమార్ వివరణ ఇచ్చారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపామని, గాంధీ ఆసుపత్రిలో ఎలాంటి అత్యాచారం జరగలేదని తేల్చిచెప్పారు. సుమారు 800 గంటల సీసీ టీవీ ఫుటేజిని పరిశీలించామని, 200 మందిని విచారించామని తెలిపారు.

ఈ కేసులో ఎలాంటి మిస్టరీ లేదని, మహిళపై సామూహిక అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు. గాంధీ ఆసుపత్రి నుంచి ఆమె స్వయంగా వెళ్లిపోయిందని, ఫిర్యాదు చేసిన ఆమె సోదరి పోలీసులను తప్పుదోవ పట్టించిందని వివరించారు. ఈ కేసులో టెక్నీషియన్ ఉమామహేశ్వర్ ప్రమేయం లేదని తెలిపారు. ఆ మధ్య ఘట్ కేసర్ లో జరిగిన ఘటనని తలపించింది.. ఈ గ్యాంగ్ రేప్ కేసు.