RRR రిలీజ్ వాయిదా ?

అక్టోబర్ 13న #RRR రిలీజ్ అంటే ఎవ్వరూ.. నమ్మలేదు. ఖచ్చితంగా మరోసారి వాయిదా పడటం ఖాయం అన్నారు. ఇప్పుడు అదే జరిగింది. #RRR మరోసారి వాయిదా పడింది. వచ్చే యేడాది మార్చికి వెళ్లిందని సమాచారమ్. ఈ నెలాఖరులో సినిమా వాయిదాపై దర్శకుడు రాజమౌళి ప్రకటన చేస్తారు. కొత్త రిలీజ్ డేటుని ప్రకటిస్తారని తెలిసింది.

వాస్తవానికి 2020 జులై 30న #RRR ప్రేక్షకుల ముందుకు రానుంది. కరోనా ఫస్ట్ వేవ్ తో రిలీజ్ డేటు జనవరి 8, 2021కి మారింది. ఇక సెకండ్ వేవ్ విజృంభణ, షూటింగ్ లో జాప్యం కారణంగా అక్టోబర్ 13, 2021కి వాయిదా పడింది. ఆ డేటున కూడా #RRR రావడం కష్టమని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం చాలదని అన్నారు. దీనికితోడు బాలీవుడ్ లో అన్ని చోట్ల థియేటర్స్ తెరచుకోలేదు. ఈ కారణంగానే #RRRని మరోసారి వాయిదా వేయాలని నిర్ణయించారు. వచ్చే యేడాది మార్చికి వాయిదా వేయనున్నారని సమాచారమ్. నిజంగా అక్టోబర్ 13 డేటు నుంచి #RRR తప్పుకుంటే.. ఆ డేటుని ఆక్రమించేందుకు ఆచార్య, పుష్ప.. తదితర సినిమాలు రెడీగా ఉన్నాయి.

హుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది. తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కోమరం భీమ్ ల జీవితాల్లోని ఓ ఉమ్మది పాయింట్ ఆధారంగా రాజమౌళి ఈ కథని రాసుకున్నారు. ఇందులో అల్లూరిగా రామ్ చరణ్, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, ఆయనకి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ జతకట్టారు. అజయ్ దేవగణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం కీరణవాణీ. డివివి దానయ్య నిర్మాత. దాదాపు రూ. 450కోట్ల బడ్జెట్ తో #RRRని తెరకెక్కిస్తున్నారు.