అన్నయ్య ముద్దు.. వదినమ్మ దెబ్బ !

మెగా ఇంట వేడుకల్లో పవన్ కనిపించడు. దీనిపై అభిమానులు పలు సందర్భాల్లో నిరాశ చెందారు. వాళ్ల ఎదురుచూపులు, నిరాశకు ఫుల్‌స్టాప్ పెడుతూ కొణిదెల కుటుంబంలో ఓ పెద్ద పండుగ జరిగింది. అదే మెగాస్టార్ చిరంజీవి 66వ పుట్టినరోజు. ఆదివారం జరిగిన ఈ వేడుకల్లో పవర్‌స్టార్ ప్రత్యేకాకర్షణగా నిలిచారు. పవన్ రాకతో అటు కుటుంబసభ్యులతోపాటు ఇటు అభిమానులు కూడా ఎంతో సంతోషించారు.

పవన్‌ని చూడగానే చిరు ఆలింగనం చేసుకుని ప్రేమగా ముద్దుపెట్టుకున్నారు. అనంతరం వదినమ్మను చూసి.. ‘ఏంటండి సురేఖ గారు. ఎలా ఉన్నారు?’ అంటూ పవన్ ఆటపట్టించారు. వదినమ్మ కొట్టిన చిన్న దెబ్బకు పవన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించాడు. ఈ వేడుకలోప్రతి ఫ్రేమూ.. ఫిదా చేసేదే. ఈ మెగా పండగక్కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా బ్రదర్స్ ని ఒకే ఫ్రేములో చూసుకొని అభిమానులు మురిసిపోతున్నారు.

#Chiranjeevi and #PawanKalyan – the hug and the kiss.@PawanKalyan @KChiruTweets pic.twitter.com/IpEPHQPWyq— dinesh akula (@dineshakula) August 23, 2021