‘భీమ్లా నాయ‌క్‌’ ఫస్ట్ సాంగ్ రికార్డుల మోత

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు కానుకగా భీమ్లా నాయ‌క్‌ టీమ్‌ హుషారైన గిఫ్ట్ ఇచ్చింది. సినిమాలోని ఫస్ట్ సాంగ్ ని విడుదల చేసింది. ప‌వ‌న్ ని ఎత్తేసే ప‌దాలు, త‌న క్యారెక్ట‌ర్‌ని అక్ష‌రాలో చూపించే ప్ర‌య‌త్నాలూ రామ జోగయ్య శాస్త్రి రాసిన పాట‌లో పుష్క‌లంగా క‌నిపించాయి. త‌మ‌న్ ట్యూను, గాయ‌కుల‌తో పాడించిన విధానం.. వెరిసి భీమ్లా నాయ‌క్ ఓపెనింగ్ అదిరిపోయింది.  

ఆడాగాదు – ఈడాగాదు 
అమీనోళ్ల మేడా గాదు
 గుర్రం నీళ్లా గుట్టా కాడ‌
అలుగూ వాగు తాండాలోన
– అంటూ ఓ సాకీతో ఈ పాట మొద‌లైంది.

ఇదే ఊపుతో తనదైన చమత్కారాలతో రామ జోగ్యయ్య శాస్త్ర పాటని పూర్తి చేశారు. పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా పాటని తీర్చిదిద్దారు. ఇప్పుడు నిజంగానే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేశాయి. ఈ జోష్ లో రికార్దులు బద్దలు అవుతున్నాయి. ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ దాటిపోయాయ్. సరికొత్త రికార్డులని సృష్టిస్తున్నాడు భీమ్లా నాయక్.