హాట్‌సీట్లో బిగ్‌బీ
సామాన్యులను కోటీశ్వరులుగా మార్చే లక్ష్యంతో హిందీలో అమితాబ్‌బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ గేమ్ షోని ప్రారంభించారు. అది కనీవినీ ఎరుగని రీతిలో హిట్టయింది. ఇప్పటి వరకు 12 సీజన్లు ముగిశాయి. శనివారం నుంచి కేబీసీ 13వ సీజన్ మొదలవుతోంది. తొలివారం టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అతిథులుగా వచ్చారు.
ఈ షోలో దాదా, వీరూ రూ.25లక్షలు గెలిచారు. రూ.50 లక్షల ప్రశ్నకు వారు సమాధానం ఇవ్వలేకపోయారు. అయితే గెలుచుకున్న రూ.25 లక్షలను ధార్మిక పనుల కోసం విరాళంగా ఇచ్చారు. ఈ షో సాంతం ఆసక్తికరంగా సాగినట్టు సమాచారం. సాధారణంగా అమితాబ్ బచ్చన్ అందరినీ ప్రశ్నలడిగితే.. ఆయన సీటును దాదా తీసుకొని బిగ్‌బీని హాట్‌సీట్లో కూర్చోబెట్టారు. యాంకర్‌గా గంగూలీ ప్రతిభను చూసిన బిగ్ బీ.. ‘ఇలాగే కొనసాగితే నా పనికే ఎసరు పెడతారేమో’ అని సరదాగా వ్యాఖ్యానించారు. దానికి ‘ఒకవేళ నేను హోస్ట్ చేయాల్సి వస్తే ముందుగా మీ వీడియోలు చూసి నేర్చుకుంటాను’ అని దాదా బదులిచ్చారు.