వీరమల్లు లెటెస్ట్ అప్ డేట్

క్రిష్‌ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. నిధి అగర్వాల్‌ కథానాయిక. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. ఎ.ఎం. రత్నం సమర్పణలో పాన్‌ ఇండియా చిత్రంగా ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొద్దిభాగం షూటింగ్ జరుపుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందనే వార్తలు వినిపించాయి.

దీనిపై తాజాగా కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌, దర్శకనిర్మాతలు సమావేశమై చర్చించారు. త్వరలోనే షూటింగ్‌ మొదలుపెట్టనున్నట్టు తెలిపారు. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథ ఇది. ఈ క్రేజీ ప్రాజెక్టు 2022 ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం పవన్‌ ‘భీమ్లా నాయక్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి సాగర్‌ కె. చంద్ర దర్శకుడు.