చరణ్-శంకర్ సినిమా టైటిల్ ‘విశ్వంభర’ ?

గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నటించనున్న 15వ చిత్రమిది. కైరా అద్వానీ కథానాయిక. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. రేపు ఈ సినిమా అప్ డేట్ ఇస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే ఇప్పటికే ఆ అప్ డేట్ లీకుల రూపంలో బయటకు వచ్చింది. రేపు సినిమా టైటిల్ ని ప్రకటించనున్నారు. ‘విశ్వంభర’ టైటిల్ ని ఫిక్స్ చేశారని చెప్పుకుంటున్నారు. ‘విశ్వంభర’ అంటే ఎర్త్ (భూమి) అని అర్థం.

మరోవైపు రామ్ చరణ్ సినిమా టైటిల్ ‘విశ్వంభర’ కాదు. ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదని చరణ్ అభిమానులు చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో #RC15 టైటిల్ పై పూర్తి క్లారిటీ రానుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తో బిజీగా ఉన్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఆయనకి జంటగా సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించనున్నారు. అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.