‘లవ్ స్టోరీ’ రావాలంటే.. ఇవన్నీ జరగాలి !
నాగ్ చైతన్య-సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ విడుదల ఎప్పుడు ? అసలు ఈ యేడాది వస్తుందా ? రాదా ?? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఎప్పుడో పూర్తయిన సినిమా ఇది. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ రీఓపెన్ కోసం వేచి చూశారు. థియేటర్స్ తెరచుకున్నాక… బోలెడు షరతులు పెట్టుకున్నారు. ఆంధ్రలో టికెట్ రేట్లు పెరగాలి. ఆంధ్రలో 100 పర్సంట్ ఆక్యుపెన్సీ ఇవ్వాలి. పోటీగా మరే సినిమా రాకూడదు. కనీసం ఓటిటిలో కూడా పోటీగా మరే సినిమా విడుదల కాకూడదు. ఆంధ్రలో సెకెండ్ షో లకు అనుమతి ఇవ్వాలనే షరతులని లవ్ స్టోరీ పెట్టుకుంది.
ఇవన్నీ జరగాలంటే ఈ నెల 20 దాటాల్సిందే. ఓ వారం పబ్లిసిటీకి తీసుకున్నా.. ఈ నెలాఖరుకు విడుదల చేసుకోవాలి. లేదంటే అక్టోబర్ నుంచి వరుస సినిమాలు క్యూ కడుతున్నయ్. నాన్ స్టాప్ గా వచ్చే యేడాది సంక్రాంతి వరకు రిలీజ్ డేట్స్ ప్రకటించుకున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ మిస్ అయితే.. ఈ యేడాది లవ్ స్టోరీ లేనట్టే. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఫిదా తర్వాత ఆయన చేస్తున్న చిత్రమిది.