సాయిధరమ్ తేజ్ పై పోలీసు కేసు.. ఏయే సెక్షన్ల కిందంటే !
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తోంది. కానీ తీవ్ర గాయాలు అయినట్టు బయటికి వచ్చిన ఫోటోలని బట్టి అర్థం అవుతుంది.మొత్తం మూడు చోట్ల.. కుడి కన్ను, చాతీ, పొట్టభాగంలో గాయాలు అయ్యాయి. బ్రెయిన్ స్కాన్ నార్మల్ గా వచ్చింది. అయితే క్లావికల్ ఫ్యాక్చర్ అయినట్టు డాక్టర్లు చెప్పినట్టు తెలిసింది.
మరోవైపు రోడ్డు ప్రమాదానికి సంబంధించి రాయదుర్గం పోలీసులు తేజుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ ల కింద కేసులు పెట్టారు. 336 ఎమ్, 184ఎంవీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తేజు స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అవ్వడం వలనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని మాధాపురం ఎస్సై అన్నారు. అతివేగమే దీనికి కారణం అన్నారు.
ఇక తేజు వినియోగించిన స్పోర్ట్స్ బైక్ అనిల్ కుమార్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఈ బైక్ విలువ రూ. 18లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో బైక్ ని డిజైన్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్యామేజ్ తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తాజా ప్రమాదంలోనూ బైక్ పెద్దగా డ్యామేజ్ కాలేదు. బైక్ నెంబర్ టీస్07, జీజే1258 అని చెబుతున్నారు.