RRR రిలీజ్ మళ్లీ వాయిదా

ఊహించిందే జరిగింది. #RRR రిలీజ్ మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 13న #RRRని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోతున్నామని చిత్రబృందం ప్రకటించింది. అక్టోబర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల చేసేందుకు పోస్ట్‌ ప్రొడెక్షన్‌ చాలా వరకూ పూర్తయ్యింది. కానీ, అందరూ అనుకున్నట్లే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల వాయిదా వేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లు ఇంకా పూర్తిగా తెరుచుకోని నేపథ్యంలో కొత్త విడుదల తేదీని ప్రకటించలేకపోతున్నాం. థియేటర్లు పునఃప్రారంభమైన వెంటనే తప్పకుండా సినిమా విడుదల చేస్తాం’ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం ట్వీట్ చేసింది.

సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరిలో రిలీజ్‌ కావాల్సిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా అక్టోబర్‌కి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ డేటుకి కూడా ఆర్ఆర్ఆర్ రావడం కష్టమే. కొన్ని వర్గాల నుంచి ఒత్తిడి కారణంగా అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ అని ప్రచారం చేస్తున్నారనే ప్రచారం జరిగింది. ఇప్పుడా.. ఆ ప్రచారమే నిజమైంది. ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా పడింది.

బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులు.  ఇందులో చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ కొమురంభీమ్‌గా, ఆయనకి జోడిగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ కనిపించనున్నారు. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఆర్ ఆర్ ఆర్ కొత్త రిలీజ్ డేటుని ప్రకటించనున్నారు.

Post production nearly done to have #RRRMovie ready by October’21.
But as known to many, we are postponing the release but cannot announce a new date with theatres indefinitely closed.
We will release at the earliest possible date when the world cinema markets are up and running.— RRR Movie (@RRRMovie) September 11, 2021