ప్రమాదం తర్వాత తేజు మాట్లాడిన మొదటి మాట.. ఇదే !
మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ మాదాపూర్ లోని కేబుల్ బ్రిడ్జ్ పై స్కిడ్ అయింది. బైక్ తో పాటు తేజు కూడా దొర్లుకుంటూ చాలా దూరం వెళ్లాడు. దీనికి సంబంధించిన సన్నివేశాలు సీసీ పుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్పృహ కోల్పోయిన ఆయన… స్పృహలోకి వచ్చారు. ఐసీయూలో ఉన్న సాయితేజ్ ను వీడియో కాల్ ద్వారా కుటుంబసభ్యులతో మాట్లాడించే ప్రయత్నాన్ని వైద్యులు చేశారు. ఈ సందర్భంగా ‘నొప్పిగా ఉంది’ అంటూ సాయితేజ్ ఒకే ఒక మాట మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఉదయం నుంచి సాయితేజ్ కు పలు వైద్యపరీక్షలు నిర్వహించారు. కాసేపటి క్రితం ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. కాగా, సాయితేజ్ స్పోర్ట్స్ బైకు నుంచి కిందపడిన ప్రమాదంలో కాలర్ బోన్ కు బలమైన దెబ్బ తగిలినట్టు వైద్యులు గుర్తించారు. రేపు సాయితేజ్ కాలర్ బోన్ కు శస్త్రచికిత్స చేయనున్నారు.