రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ లో బ్రేక్ ఫాస్ట్ చేసిన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సింపుల్ సిటీకి మరో ఉదాహరణ. ప్రస్తుతం బన్నీ పుష్ప షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఏపీలో గోకవరం ప్రాంతంలో పుష్ప షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం బన్నీ రోడ్డు పక్కన ఓ పూరిగుడిసెలో నిర్వహిస్తున్న టిఫెన్ సెంటర్ కి వచ్చి టిఫిన్ చేశారు. దానికి సంబంధించిన వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్నీ సింపుల్ సిటీకి ఇది మరో ఉదాహరణ అంటూ ఆయన అభిమానులు లెటెస్ట్ వీడియోని షేర్ చేస్తున్నారు.

సుకుమార్-బన్నీల కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బన్నీ ‘పుష్పరాజ్’ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో బన్నీకి జంటగా రష్మిక నటిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా పుష్ప రెండు పార్టులుగా రానుంది. ఈ యేడాది క్రిస్మస్ కానుకగా పుష్ప పార్ట్ -1 ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.

Icon StAAr @alluarjun had breakfast at a road side tiffin centre near Gokavaram, AP.

Man of simplicity for a reason!#AlluArjun #ThaggedheLe #Pushpa pic.twitter.com/7XOjyvBTgO— Manobala Vijayabalan (@ManobalaV) September 13, 2021