దళితులకి సీఎం కేసీఆర్ మరో శుభవార్త
దళితులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త చెప్పారు.అర్హులైన ఎస్సీలకు మైనింగ్ లీజులు, సివిల్ కాంట్రాక్టులు, మద్యం దుకాణాలు, ఇతరత్రా ప్రభుత్వ లైసెన్సుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టు అమలుపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఎస్సీ సాధికారత కింద అసెంబ్లీలో రూ.1000 కోట్లు ప్రకటించినట్లు చెప్పారు. ఆర్థిక, సామాజిక వివక్షను తరిమికొట్టాలనే ఆశయంతోనే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చానన్నారు.
కచ్చితమైన లక్ష్యాన్ని నిర్ధేశించుకొని దళిత బంధు అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దళిత బంధుకు బడ్జెట్‌లో సైతం నిధులు కేటాయిస్తామన్నారు. అర్హులైన ఎస్సీలకు ప్రభుత్వ లైసెన్సుల్లో రిజర్వేషన్లు కలిపిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. అర్హులైన ఎస్సీలకు మైనింగ్ లీజులు, సివిల్ కాంట్రాక్టులు, మద్యం దుకాణాలు, ఇతరత్రా ప్రభుత్వ లైసెన్సుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. మెడికల్, ఫర్టిలైజర్ దుకాణాలు, మీ సేవా కేంద్రాలు, గ్యాస్ డీలర్‌షిప్‌లు కేటాయిస్తామని తెలిపారు. దళిత బంధుతోనే దఌతుల బతుకులు పూర్తిగా మారిపోనున్నాయి అనుకుంటే.. ఇప్పుడు ప్రభుత్వ లైసెన్సుల్లో వారికి రిజర్వేషన్లు తీసుకొస్తామని ప్రకటించి బోనస్ ఇచ్చినట్టయింది.