హరీశ్‌రావు ధూమ్‌ధామ్‌ డ్యాన్స్

మంత్రి హరీష్ రావు మాటల మాంత్రికుడు అన్న విషయం అందరికీ తెలుసు. సీఎం కేసీఆర్ తర్వాత ఆ రేంజ్ లో ప్రజలని ఆకట్టుకొనే సత్తా ఉన్న నాయకుడు. హరీష్ కు మాటలే కాదు. డ్యాన్స్ కూడా వచ్చు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి హరీశ్‌ రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గెలుపు కోసం శ్రమిస్తున్నడు.  ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరుగుతూ పార్టీ విజయానికి బాటలు వేస్తున్నారు.

ఈ క్రమంలోనే కళాకారుల ధూమ్‌ధామ్‌ కార్యక్రమంలో భాగంగా.. ‘తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా’  అనే పాటకు మంత్రి హరీశ్‌ రావు అదిరిపోయే స్టెప్పులేశాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ స్టయిల్ లో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నడు. పార్టీ కండువాలు పట్టుకుని గాల్లో తిప్పుతూ కొంత కాలు కదిపిండు. హరీష్ రావుతో పాటుగా ఎమ్మెల్యే బాల్క సుమన్, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌ నాయకుడు పాడి కౌశిక్‌ రెడ్డి డ్యాన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.