ఇస్మార్ట్ పోరీతో హాట్ సీన్లు తీశారా.. ?

బాలీవుడ్ హిట్ ‘అంధాధూన్’ రీమేక్ గా తెలుగులో ‘మాస్ట్రో’ వస్తోంది. నితిన్-నభా నటాషా జంటగా నటించారు.హిందీలో రాధికా ఆప్టే పోషించిన పాత్రను తెలుగులో నభా చేసింది. అయితే బాలీవుడ్ లో రాధిక ఫుల్ గ్లామరస్ గా కనిపించింది, కొన్ని సన్నివేశాల్లో చాలా హాట్ గా, బోల్డ్ గా కూడా నటించింది. హీరోతో లిప్ కిస్సులు, శృంగార సన్నివేశాలు కూడా ఉన్నాయి.మరీ తెలుగులోనూ ఆ హాట్ సీన్లని రిపీట్ చేశారా ? అనే చర్చ జరుగుతోంది. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నభా దీనిపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. 

“రాధిక ఆప్టే అద్భుతంగా చేసింది. నేను అలా చేయగలనా అనిపించింది. కానీ దర్శకుడు కథను మాత్రం తీసుకుని తన విజన్‌తో సినిమాను తీశారు. దానికి దీనికి సంబంధం ఉండదు. నా పాత్రలో ఎన్నో మార్పుచేర్పులు చేశారు. తెలుగు చిత్రంలానే ఉంటుంది తప్ప రీమేక్ అనిపించదు. కథలోని జీవం మాత్రం అలానే ఉంటుంది.” అని నభా చెప్పుకొచ్చింది. తను గ్లామరస్ గా కనిపిస్తాను తప్ప, బోల్డ్ గా కనిపించనని క్లారిటీ ఇచ్చింది నభా. ఇక ఈ సినిమాలో తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఈనెల 17న ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.