నిర్మాతతో ఐదేళ్ల డేటింగ్.. బయటపెట్టిన హీరోయిన్ !
సినీ పరిశ్రమలో డేటింగులు, బ్రేకప్పులూ సహజమే. బాలీవుడ్ లో అయితే మరీనూ. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ నర్గిస్ ఫఖ్రీ తన డేటింగ్ వ్యవహారాన్ని స్వయంగా బయటపెట్టింది. ఆమె నిర్మాత ఉదయ్ చోప్రాతో డేటింగ్ లో ఉందంటూ బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరిగింది. ఇన్నాళ్లకు ఈ ప్రచారంపై నర్గీస్ తొలిసారి స్పందించింది. ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయ్ తో తన బంధాన్ని బయటపెట్టింది. ఉదయ్, తాను ఐదేళ్లపాటు డేటింగ్ చేశామని తెలిపింది.
అంతేకాదు.. తాను కలిసిన వ్యక్తుల్లో అందిరి కంటే గొప్పవాడు, మంచివాడు ఉదయ్ అంటూ సర్టిఫికెట్ ఇచ్చేసింది. ఉదయ్ తో ఉన్న అనుబంధం గురించి ఇంతకాలం ఎందుకు స్పందించలేదు ? అనే ప్రశ్నక్కు కూడా సమాధానం ఇచ్చింది. డేటింగ్ వ్యవహారాల గురించి బయటకు చెప్పకూడదని చాలా మంది తనకి సూచించారు. అందుకే ఎప్పుడు.. ఎక్కడ చెప్పలేదని చెప్పుకొచ్చింది. 2016లో ఈ జంట విడిపోయిందనే వార్తలు వినిపించాయి. అయితే ఉదయ్ తో బ్రేకప్ పై నర్గీస్ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.