దమ్ దమ్ చేయలేకపోయింది ! బిగ్ బాస్ హౌస్ నుంచి సరయూ అవుట్ !!

బోల్డ్ కు బై బై చెప్పేశారు బిగ్ బాస్ ప్రేక్షకులు. బిగ్ బాస్ హౌస్ నుంచి బోల్డ్ బ్యూటీ సరయూ రాయ్ ని పంపించేశారు. 19 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్-5 గత వారం ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. వీరిలో వారానికో కంటెస్టెంట్ ఎలిమినేట్ కావాల్సిందే. అయితే తొలివారం ఎవరు ? బయటికి వస్తారు ? అనే ఆసక్తి నెలకొంది. అనూహ్యంగా సరయూ ఎలిమినేట్ అయింది. అందరినీ దమ్ దమ్ చేస్తానని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన సరయూ తొలివారంతోనే తట్టాబుట్టా సర్దేసింది. 

సరయూ తొలివారమే ఎలిమినేట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆమె కంటే ముదురు కంటెస్టెంట్స్ ఉమాదేవి, శైలజా ప్రియ  (వయసులో) హౌస్ లో ఉన్నారు. జెస్సీ అమాయక చక్రవర్తిలా కనిపించాడు. వీరందరు కాదని సరయూ ఎలిమినేట్ అవ్వడం షాకింగే. అయితే ఇందులో రెండు యాంగిల్స్ ఉన్నాయి. సరయూని తీసుకోవడంపై సోషల్ మీడియా వేదికగా నెగటివ్ ప్రచారం జరిగింది. ఇప్పుడు సరయూ ఎలిమినేషన్ తో ఆ తప్పుని బిగ్ బాస్ సరిదిద్దుకున్నట్టు అయింది. బిగ్ బాస్ ఫ్యామిలీ షో అని సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్టు అయింది. ఇదీగాక.. తొలివారంలో సరయూ పెద్దగా ఎలివేట్ కాలేదు. తనలోని వర్జినాలిటీని బయటికి తీయలేదు. ఇవన్నీ కలిపి.. ఆమెని తొలివారమే హౌస్ నుంచి బయటికి వచ్చేలా చేశానని చెప్పవచ్చు.