‘మా’లో విందు రాజకీయాలు
మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల హీట్ సాధారణ ఎన్నికలని తలపిస్తున్నాయి. విందు రాజకీయాలు నడుస్తున్నయి. మా ఎన్నికల్ని సీరియస్ గా తీసుకోవొద్దు… అంటూనే మా
ని పూర్తిగా రాజకీయం చేసేస్తున్నార్య్, సభ్యులతో మంతనాల పేరుతో.. వాళ్లకు విందు వినోదాలు ఎరచూపి, వాళ్ల ఓట్లు కొల్లగొట్టే పనిలో ఉన్నారు.
మొన్నటికి మొన్న హైదరాబాద్ లోని జేఆర్సీ ఫంక్షన్ హాల్ లో దాదాపు రెండొందల మంది మా
సభ్యులకు లంచ్ ఏర్పాటు చేశారు. వాళ్లతో సమావేశమయ్యారు. మా
ఎన్నికల విధి విధానాల్ని చర్చించారు. ఇప్పుడు విష్ణు కూడా ఇదే ఫాలో అయ్యాడు. సోమవారం రాత్రి పార్క్ హయత్ లో విష్ణు మా
సభ్యులకు డిన్నర్ ఏర్పాటు చేశాడు. తను గెలిస్తే ఏం చేస్తాడో.. సభ్యులకు వివరంగా చెప్పాడు. ఈ డిన్నర్ కి దాదాపు వంద మంది సభ్యులు హాజరైనట్టు తెలుస్తోంది.