తేజు ఆరోగ్యం.. అదొక్కటే కలవరం !
మెగా యంగ్ హీరో సాయిధరమ్ ఆరోగ్యం ప్రస్తుతం నికలడగానే ఉంది. ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. అయితే ఒక్క విషయమే కలవర పెడుతోందని సమాచారమ్. అయిదు రోజులుగా తేజు వెంటిలేటర్ పైనా ఉన్నాడు.ఎక్కువ రోజులు ఈ వ్యవస్థ మీద వుంటే శరీరం మీద వేరే ప్రభావాలు చూపించే అవకాశం వుందని తెలుస్తోంది. అందుకే దాన్ని తీసేయాల్సి వుంది.
దాని కోసం ఆల్టర్ నేటివ్ పద్దతలు ఏమిటి అనేది మెగా ఫ్యామిలీ అంతా డిస్కస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్, ఆయన సోదరులు, కుటుంబ సభ్యులు సోమవారం రోజంతా అపోలో లోనే వున్నారు. వెంటిలేటర్ కి బదులు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ షూటింగ్ లో వున్న పవన్ కూడా వీలు చూసుకుని అపోలోకి వెళ్లి ఈ డిస్కషన్ లో పాలు పంచుకున్నట్లు తెలుస్తోంది.
ఆదివారం కాలర్ బోన్ సర్జరీ చేశారు. అది విజయవంతం అయింది. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. తేజ్ కు వెంటిలేటర్ అవసరం క్రమంగా తగ్గుతోందని వివరించారు. కానీ అలా జరగడం లేదు. వెంటలేటర్ వ్యవస్థపైనే ఇంకా తేజు ఉన్నాడు. ఇప్పుడు.. ఇదే కలవరపెడుతోంది. ఇవాళ లేదా రేపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చూస్తున్నారు.