సమంత-చైతూ.. డెడ్ లైన్ 24 !

టాలీవుడ్ లో వినిపిస్తున్న హ్యాట్ గాసిప్ సమంత-చైతూల డివోర్స్. ఈ జంట ఇప్పటికే కలిసి ఉండటం లేదు. వేరు కాపురం పెట్టారు. ఇద్దరూ మ్యూచువల్ డైవోర్స్ కు దరఖాస్తు చేసేసారని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పైగా ఈ వార్తలు ధృవీకరిస్తూ పలు పోస్ట్ లు సమంత వైపు నుంచి వచ్చాయి.

జనవరి లో ‘లవ్ స్టోరీ’ టీజర్ విడుదలయినప్పుడు సమంత చేసిన ట్వీట్ ”..ఇంత కన్నా గొప్పగా మరెవరు చేయలేరు చైతూ రోజు రోజుకు నటన పరంగా మరింత బలోపేతం అవుతున్నారు….” ఇలాంటి అర్థం వచ్చేలా రాసుకొచ్చింది. కట్ చేస్తే.. 9 నెలలు గడిచాయ్. సెప్టెంబర్… లవ్ స్టోరీ ట్రయిలర్ విడుదలయింది. చైతూ ట్వీట్ నే రీ ట్వీట్ చేస్తూ, చైతన్యను టాగ్ చేయకుండా కేవలం సాయి పల్లవిని టాగ్ చేస్తూ జస్ట్ ”ఆల్ ది బెస్ట్ టు టీమ్’.. ఇదీ సమంత లో వచ్చిన మార్పు.

సమంత ఇటీవల కొంతకాలం గోవాలో వుండి వచ్చారు. ఇప్పుడు చెన్నయ్ లో వుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. చైతూ ఒంటరిగానే వుంటున్నారని టాక్. ఇదిలా వుంటే ఈనెల 24న చైతూ లవ్ స్టోరీ సినిమా విడుదల కాబోతోంది. ఆ సినిమా ప్రమోషన్లకు చైతూ మీడియా ముందుకు రాబోతున్నారు. ఈ మేరకు ఆయన నిర్మాతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాఖలో కూడా ఓ ఈవెంట్ లేదా మీడియా మీట్ వుంటుంది. ఎక్కడో ఒక చోట చైతూని సమంతతో డివోర్స్ వ్యవహారంపై ప్రశ్నలు అడగడం ఖాయం. దీనిపై చైతూ అప్పుడైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.