పది వారాల దీక్ష.. ఫలితమేది ?

‘తెలంగాణ వైఎస్ఆర్’ పేరిట వైఎస్ షర్మిల పార్టీ పెట్టింది. తెలంగాణలోని సమస్యలపై పోరు బాట పట్టింది. నిరుద్యోగుల సమస్యని ఎత్తుకున్న షర్మిల.. ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేస్తుంది. ఇప్పటికే పది వారాల దీక్ష పూర్తయింది. కానీ ఫలితం శ్యూన్యం. దీనిపై షర్మిల అసహనం వ్యక్తం చేసింది. ప్రతి మంగళవారం దీక్షలో భాగంగా ఈ వారం హనుమకొండలో నిరహార దీక్ష చేపట్టారు షర్మిల. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడారు. తాను పది వారాలుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని అసహనం వ్యక్తం చేసింది.

రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీసింది. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు దీక్షలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఇన్ స్టంట్ ఫలితాలు రావడం చాలా అరుడు. పది వారాలకే ఫలితం రాకుంటే.. షర్మిల ఓపిక నషిస్తే ఎలా ? పది వారాలు కాదు.. ఫలితం కోసం పది సంవత్సరాలు ఎదురు చూసే ఓపిక కూడా ఉండాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.