“అవతార్ 2” కాన్సెప్ట్ పోస్టర్స్.. చూశారా ?

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో వచ్చిన గ్రాఫిక్ వండర్ అవతార్. 2009లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ఇప్పుడీ.. ఈ గ్రాఫిక్ వండర్ కి సీక్వెల్ రెడీ అవుతోంది. అవతార్2 వచ్చే యేడాది (2022) విడుదల కానుంది. తాజాగా అవతార్2 కి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్స్ ని చిత్రబృందం విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూస్తే మొదటి భాగం కన్నా ఇందులో విజువల్స్ ఇంకా కొత్తగా అద్భుతంగా ఉండేలా ఉన్నాయని తెలుస్తుంది.

అవతార2 మాత్రమే కాదు.. నాలుగైదు సీక్వెల్స్ రానున్నాయి. రెండేళ్లకో సీక్వెల్ వచ్చేలా దర్శకుడు జేమ్స్ కేమరూన్ ప్లాన్ చేశారు. 2022లో అవతార్ 2 రానుంది. 2024లో అవతార్3, 20226లో అవతార్4, 2028లో అవతార్5 రానున్నాయి.