సరయు మీద ఎటాక్
వందరోజులు ఉంటా.. బిగ్ బాస్ ని కూడా ధమ్ ధమ్ చేస్తా అంటూ హౌస్ లోకి వెళ్లింది సరయు. కానీ తొలివారంలోనే ఎలిమినేట్ అయింది. ఎలిమినేషన్ జాబితాలో ఉన్నవారిలో సరయుకి తక్కువ ఓట్లు వచ్చాయి. అందుకే ఆమె ఎలిమినేట్ అయిందని హోస్ట్ నాగ్ ప్రకటించారు. కానీ కారణం వేరే ఉంది. తొలివారంలో సరయుని ఎలివేట్ చేయలేదు. ఆమె ఇతరులతో పడిన గొడవలని మాత్రమే చూపించారు. ఆమె పెద్దగా స్కీన్ స్కోప్ ఇవ్వలేదు. ఇది బిగ్ బాస్ వేసిన భారీ స్కెచ్ అని సరయు అభిమానులు చెప్పుకుంటున్నారు.
ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చిన సరయు అందరికీ ఓ రేంజ్ లో ఇచ్చేసింది. ముఖ్యంగా షణ్ముఖ్, సిరిలని తనదైన శైలిలో ధమ్ ధమ్ చేసింది. షణ్ముఖ్ కి ఆడటం చేతకాకుంటే గాజులు వేసుకోవాలని ఫైర్ అయింది. ఈ నేపథ్యంలో షణ్ముఖ్ ఫ్యాన్స్ సరయుపై ఎటాక్ మొదలెట్టారట. సోషల్ మీడియా వేదికగా గలీజు కామెంట్స్ చేస్తున్నారట. అంతేకాదు.. ఫోన్లు చేసి కూడా ధమ్ ధమ్ చేస్తున్నారట. ఈ విషయాన్ని సరయునే తెలిపింది. 7ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ లోకి వచ్చి.. ఈ వివరాలు చెప్పింది. అంతేకాదు.. చైత్ర ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్తున్నా.. దమ్ముంటే అక్కడి రండీ అంటూ సవాల్ విసిరింది. మొత్తానికి.. షణ్ముఖ్ ఫ్యాన్స్ బెదిరింపులకు ఈ బోల్డ్ బ్యూటీ ఏమాత్రం జంకడం లేదు.