చిన్నారి చైత్ర ఇంటి ముందు షర్మిల దీక్ష
హైదారాబాద్ లోని సైదాబాద్ సింగరేణి బస్తీలో ఆరేళ్ల చిన్నారి చైత్ర దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన ప్రతీ ఒక్కరినీ కలచివేసింది. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకొని దారుణంగా శిక్షించాలి. ఉరిశిక్ష విధించాలని సామాన్యులు, సెలబ్రిటీలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇన్నాళ్లు సోషల్ మీడియా వేదికగానే చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన రాజకీయ, సినీ ప్రముఖులు.. ఇప్పుడు చైత్ర కుటుంబాన్ని కలవడానికి వస్తున్నారు. పరామర్శిస్తున్నారు. చైత్ర కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
చైత్ర కుటుంబాన్ని కలవడానికి వచ్చిన వైఎస్ షర్మిల అక్కడే దీక్షకు దిగారు. ఈ దారుణ ఘటనపై ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణం అన్నారు. చైత్ర కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ స్పందించే వరకు ఇక్కడే దీక్ష చేస్తానని దీక్షకు దిగారు. దఌత బిడ్డలు అంటే సీఎం కేసీఆర్ కు లెక్కలేదా ? ఎస్టీ బిడ్ద అనే ఇంత నిర్లక్ష్యమా ? మీ ఇంట్లో ఇలాంటి ఘటన జరిగితే ఇట్లనే ఉంటారా ? అని ప్రశ్నించారు. ఇక మరికొద్దిసేపట్లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చైత్ర కుటుంబ సభ్యులని కలవడానికి రానున్నారు.