‘గ‌ల్లీ రౌడీ’తో ‘మాస్ట్రో’ ఫైట్‌

 ప్రేక్షకులు థియేటర్స్ కి రావడానికి రెడీగా ఉన్నారు. రావాల్సింది మంచి సినిమా మాత్రమే. ‘సీటీమార్’కి గుడ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు థియేటర్స్ క్యూ కట్టారు. సీటీమార్ చూశారు. ఎంజాయ్ చేశారు. ఈ శుక్ర‌వారం అయితే, అటు ఓటీటీలోనూ, ఇటు వెండి తెర‌పైనా కొత్త సినిమాల జాత‌ర క‌నిపించ‌బోతోంది. నితిన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన మాస్ట్రో ఈ వార‌మే విడుద‌ల అవుతోంది. డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కానుంది. 

ఇక అదే రోజున థియేట‌ర్ల‌లో గ‌ల్లీ రౌడీ సంద‌డి చేయ‌బోతున్నాడు. సందీప్ కిష‌న్ – జి.నాగేశ్వ‌ర‌రెడ్డి కాంబోలో రూపొందిన సినిమా ఇది. నాగేశ్వ‌రరెడ్డి కామెడీ టైమింగ్ బాగుంటుంది. మంచి క‌థ ఎంచుకుంటే క‌చ్చితంగా హిట్ కొట్ట‌గ‌ల ద‌మ్ముంది. ప్ర‌చార చిత్రాలు బాగుండ‌డంతో – ఈ సినిమాపై అంద‌రి దృష్టీ ప‌డింది. ఇదే రోజున విజ‌య్ ఆంటోనీ విజ‌య్ రాఘ‌వ‌న్‌, హ‌ర్బ‌జ‌న్ సింగ్ తెరంగేట్రం చేసిన ఫ్రెండ్ షిప్‌, జెమ్‌, ప్లాన్ బి, హ‌నీ ట్రాప్ సినిమాలు థియేట‌ర్ల‌లోనే రాబోతున్నాయి. మరీ.. ఏ చిత్రాలు ప్రేక్షకులని ఎంత మేరకు ఆకట్టుకుంటాయి అన్నది చూడాలి.