సోనూసూద్‌ ఇంట్లో సోదాలే సోదాలు

బాలీవుడ్ నటుడు సోనూసూద్ ని దేశమంత రియల్ హీరోగా చూస్తోంది. కనిపించే దేవుడు అంటూ కీర్తిస్తుంది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం అతడు దొంగగా కనిపిస్తున్నాడు. పన్ను ఎగవేసే దోషిగా కనిపిస్తున్నాడు. నిన్న సోనూ నివాసం, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం మరోసారి ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు.. సోదాలు చేస్తున్నట్టు సమాచారమ్.

పన్ను ఎగవేతకు సంబంధించిన ఓ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి, లఖ్‌నవూ నగరాల్లోని సోనూసూద్‌కు చెందిన ఆరు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఏకకాలంలో దాదాపు 20 గంటల పాటు ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. ఇటీవల సోనూసూద్‌.. ఢిల్లీ ‘ఆప్‌’ ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. సీఎం కేజ్రీవాల్‌ను కూడా కలిశారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఆప్ ని విస్తరించే పనిలో క్రేజీవాల్ ఉన్నారు. పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రలోనూ ఆప్ అభివృద్దికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోనూసూద్ ఇంట్లో తాజా ఐటీ సోదాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.