అర్జున్ రెడ్డిని మించిపోయింది

అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ షాక్ ఇచ్చాడు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి అర్జున్ రెడ్డి మాత్రమే కనిపించాడు. ఎక్కడ కూడా విజయ్ దేవరకొండ కనిపించలేదు. అంతలా పాత్రలో లీనమైపోయి నటించాడు రౌడీ హీరో. అయితే ఇప్పుడు అర్జున్ రెడ్డి దానమ్మమ్మని రెడీ చేస్తున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్.

పూరి దర్శకత్వంలో రౌడీ నటిస్తున్న చిత్రం లైగర్. అనన్యపాండే హీరోయిన్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత బుధవారం నుంచి లైగర్ షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. విజయ్ ట్విట్ చేశారు. ఈ సందర్భంగా ఓ పిక్ ని షేర్ చేశాడు. బాక్సింగ్ రింగులో ఉన్న విజయ్ బ్యాక్ లుక్ పిక్ అది. ఆ పిక్ చూస్తుంటే.. అర్జున్ రెడ్డిని మించిపోయేలా ఉందని అనిపిస్తుంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాద్‌, బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌లు సంయుక్తంగా పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు.