NBK107.. అవన్నీ అవాస్తవం !

బాలయ్య ‘అఖండ’ సినిమాతో బిజీగా ఉన్నారు. బాలయ్య-బోయపాటి కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని బాలయ్య సినిమా ఉండనుంది. బాలయ్య నటించనున్న 107వ సినిమా ఇది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. బాలకృష్ణ పవర్‌ఫుల్ లుక్‌లో దర్శనమివ్వనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఈ సినిమాకి టైటిల్ ఇదే అంటూ.. సోషల్ మీడియా వేదికగా పలు పేర్లు వినిపిస్తున్నాయి. అవి వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ టైటిల్ ల ప్రచారంపై చిత్రబృందం స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని, అలాంటి రూమర్లు నమ్మొద్దని ఓ ప్రకటన విడుదల చేసింది. ”NBK107′ సినిమా పేరు గురించి వస్తోన్న వార్తలు అవాస్తవమైనవి. సరైన సమయంలో మేమే టైటిల్‌ని అధికారికంగా ప్రకటిస్తాం. మరిన్ని అప్‌డేట్లు అందిస్తాం’ అని పేర్కొంది.