బ్లూ.. సూటు.. బూటు !

రావిషింగ్ రాశీఖన్నాని చూసి.. ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. అందాల రాశీఖన్నా తెలుగులో బోలేడు అభిమానులని సంపాదించుకుంది. మొదట గ్లామర్ పాత్రలతో అదరగొట్టింది. గ్లామర్ క్వీన్ అనిపించుకుంది. ఆ తర్వాత తనలోని కొత్త యాంగిల్ ని చూపించేసింది. అద్భుతమైన నటనతో కట్టిపాడేసింది. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇంతటి బిజీలోనూ ఫోటో షూట్స్ కి గ్యాప్ ఇవ్వడం లేదు.

తాజాగా బ్లూ.. సూటు.. బూటులో దిగిన ఫోటోలని రాశీ తన ట్విట్టర్ ఖాతాలో చేరింది. బ్లూ కలర్ లో రాశీ అందాలు మరింత హైలైట్ గా కనిపిస్తున్నాయి. రాశీ నటించిన బాలీవుడ్ చిత్రం #TughlaqDurbar ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఫోటో షూట్ చేసింది. బాలీవుడ్ కల్చర్ కి తగ్గుట్టుగా సరికొత్త యాంగిల్స్ లో పోజులిచ్చింది. ఇప్పుడీ.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

