చట్టాలపై అవగాహన కల్పిస్తారట

గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. #RRR చరణ్ చేస్తున్న చిత్రమిది. కైరా అద్వాణీ కథానాయిక. ఇటీవలే క్లాప్ కొట్టారు. అతి త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా కోసం ‘విశ్వంభర` అనే టైటిల్ ప్రచారంలో ఉంది. సినిమా కాన్సెప్ట్ ఏంటీ అన్నది తెలియాల్సి ఉంది.

సాధారణంగా శంకర్ సినిమాలు సామాజిక కోణంలో ఉంటాయి. చరణ్ సినిమాలోనూ అవి ఉంటాయి. ఈ సినిమాలో చరణ్ ఓ కలెక్టర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో శంకర్ మన భారతీయ చట్టాలపై అవగాహన కల్పించబోతున్నాడని తెలుస్తోంది. ఇండియన్ పీనల్ కోడ్ లోని కొన్ని కీలకమైన విషయాల్ని…అర్థమయ్యేలా చెప్పబోతున్నాడట.

కార్పొరేట్ వ్యవస్థలు భారతీయ చట్టాల్ని అడ్డు పెట్టుకుని ఎలా ఎదుగుతున్నాయి? సామాన్యులు ఎలా నష్టపోతున్నారు? ఇలాంటి సున్నితమైన, విలువైన విషయాల్ని శంకర్ ఇందులో చర్చించబోతున్నాడని తెలుస్తోంది.