SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్
SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఎస్బీఐ పండగ సీజన్ ఆఫర్ ప్రకటించింది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా అన్ని గృహ రుణాలకు 6.7శాతం వడ్డీరేటు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. క్రెడిట్ స్కోరు ఆధారంగా వినియోగదారులు ఈ ఆఫర్‌ను పొందొచ్చని తెలిపింది.
ఈ ఆఫర్ కింద ప్రాసెసింగ్ ఫీజును కూడా తొలగించినట్లు ప్రకటించింది. అంతకుముందు రూ.75లక్షల కంటే ఎక్కువ మొత్తంలో గృహరుణం తీసుకునే వారు 7.15శాతం వడ్డీరేట్లు చెల్లించాలి. అయితే ఈ పండగ ఆఫర్‌తో కొత్తగా గృహరుణం తీసుకునేవారికి.. ఎంత మొత్తం రుణానికైనా 6.70వడ్డీరేటు ఉంటుందని బ్యాంకు తెలిపింది. అంతేగాక, గృహరుణాలను బదిలీ చేసుకునేవారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది.