నా భర్త భాగోతం నాకు తెలీదు : శిల్పాశెట్టి
పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాపై ఉచ్చు బిగుస్తొంది. ఆయనపై పోలీసులు 1500 పేజీల అదనపు ఛార్జీ షీటుని దాఖలు చేశారు. అయితే ఈ వ్యవహారంలో శిల్పాశెట్టి పెద్దగా స్పందించలేదు. ఇప్పటివరకు ఓకే ఒకసారి స్పందించి.. తన ఆవేదనని వెల్లగక్కింది. తాజాగా మరోసారి భర్త కేసుపై శిల్పా స్పందించారు. గతంలో తన భర్త ఏం చేసేవాడో తనకు తెలియదని ప్రకటించింది. తను నిత్యం షూటింగ్స్ తో బిజీగా ఉండేదాన్నని, రాజ్ కుంద్రా ఆ టైమ్ లో ఏం చేసేవాడో తనకు అస్సలు ఐడియా లేదని శిల్పాషెట్టి చెప్పుకొచ్చింది. స్వయంగా పోలీసులు నమోదుచేసిన ఛార్జ్ షీట్ లో శిల్పాషెట్టి ఈ విషయం చెప్పింది.
జులై 19 నుంచి రాజ్ కుంద్రా జైలులోనే ఉంటున్నాడు. అతడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఇప్పటికే 2 సార్లు రిజెక్ట్ అయింది. తాజాగా మరోసారి బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నాడు కుంద్రా. అదింకా పెండింగ్ లో ఉంది. తను కేవలం ఎరోటిక్ కంటెంట్ మాత్రమే తీశానని, పోర్న్ కంటెంట్ (సెక్స్ వీడియోలు) తీయలేదని తన బెయిల్ పిటిషన్ లో వాదిస్తున్నాడు