మోడీ దృష్టికి చిన్నారి ఘటన

రాజకీయ పార్టీలు – నేతల కక్కుర్తి ఎలా ఉంటుంది ? అన్నది చిన్నారి చైత్ర హత్యాచార ఘటనతో మరోసారి రుజువైంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు అటు వైపు చూడలేదు. ఒక్కసారి వైరల్ అయ్యాక.. క్రిడిట్ కొట్టేయాలనే చాలా మంది ప్రయత్నించారు. చైత్ర కుటుంబ సభ్యులని పరామర్శించడానికి వచ్చిన వైఎస్ షర్మిల.. అనూహ్యంగా అక్కడే దీక్షకు దిగారు. క్రిడెట్ కొట్టేసేందుకు ట్రై చేశారు. తాను దీక్షకి దిగిన తర్వాతే మంత్రులు చైత్ర ఇంటికి వచ్చారని ఆల్రెడీ షర్మిల ట్విట్ చేశారు.

ఒక్క పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తప్పా.. మిగితా వారంత చైత్ర ఘటనని క్యాష్ చేసుకుందామనుకున్నవారే. మంత్రులు, ప్రతిపక్ష నేతలు చైత్ర ఇంటికి వచ్చి గుండీలు చిచ్చుకున్నరు. తెలంగాణ భాజాపా మహిళా నేత కూడా అలానే ప్రవర్తించడం విశేషం. గురువారం విజయశాంతి సైదాబాద్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

సింగరేణికాలనీలో దారుణమైన ఘటన జరిగినా, ముఖ్యమంత్రి రాకపోవడం సిగ్గుచేటని.. కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే హక్కులేదన్నారు రాములమ్మ. చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఈ కామెంట్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. తీరిక పరామర్శించిన తర్వాత ప్రధాని దృష్టికి తీసుకెళ్తారా ? ఇప్పటి వరకు ఆ పని చేయలేదా ??. అయినా… దేశంలో ఇలాంటి ఘటనలు రోజుకి పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.