చిన్నారి హత్యతో రాజకీయ మైలేజీ

చిన్నారి హత్యతో రాజకీయ మైలేజీ సాధించాలనే ప్రయత్నం అంందరూ చేస్తున్నా..  షర్మిల మాత్రం గీత దాటారన్న విమర్శలు వస్తున్నాయి. బుధవారం చైత్ర కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన షర్మిల.. అనూహ్యంగా దీక్షకు దిగింది. హత్యాచారానికి గురైన కుటుంబానికి రూ. పది కోట్ల నష్టపరిహారం, సీఎం కేసీఆర్ స్పందించే వరకూ తాను సింగరేణి కాలనీలో దీక్ష చేస్తానని ప్రకటించి.. అక్కడే కూర్చుంది.

ఇతర రాజకీయ పార్టీల నేతలు పరామర్శకు వస్తున్నా ఆమె మాత్రం అక్కడ్నుంచి కదల్లేదు. విషయం రాజకీయం అవడంతో ఆ రాజకీయంలో తానే చాంపియన్ కావాలనుకున్నారు. అనుకున్నట్లుగానే దీక్షకు కూర్చున్నారు. ఇతర రాజకీయ నేతలు పరామర్శకు రాకుండా తనదే షో అనుకున్నారు. ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేసినా.. నిందితుడు దొరికినా కావాల్సినంత పబ్లిసిటీ లభించేది. కానీ ఆ రెండు జరగలేదు. షర్మిలను పోలీసులు ఇంటికి పంపేశారు. అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు ఆమెను దీక్ష నుంచి తరలించారు. ఆ సమయంలో వైఎస్ఆర్ కార్యకర్తలు కూడా పెద్దగా లేకపోవడంతో పోలీసుల పని మరింత ఈజీ అయింది. ఫలితంగా షర్మిలకు దీక్ష చెడ్డా ఫలితం దక్కని పరిస్థితి ఏర్పడింది