స్టార్ డైరెక్టర్ ఓటీటీ గ్రూపు

టాలీవుడ్ నుంచి చాలామంది దర్శకులు ఇప్పటికే ఓటీటీలో అడుగుపెట్టారు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ కూడా ఓటీటీపై ఫోకస్ పెట్టినట్టు కనబడుతుంది. ఓటీటీ కోసం కొరటాల కొన్ని కథలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఓటీటీ కోసం తనకు బాగా తెలిసిన కొంతమంది దర్శకులతో ఓ గ్రూప్ ను తయారుచేశాడు కొరటాల.వారితో ఓటీటీ కోసం కథలు సిద్ధం చేయిస్తున్నాడు. స్వయంగా కొరటాల నిర్మాతగా ఆ కథలని సినిమాలుగా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు.

ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాతో కొరటాల శివ ఉన్నాడు. మరోవైపు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాపై కూడా గట్టిగా దృష్టిపెట్టాడు. ఇలా రెండు బడా ప్రాజెక్టులను హ్యాండిల్ చేస్తూనే, మరోవైపు ఓటీటీ కథలపై కూడా వర్క్ చేస్తున్నాడట ఈ స్టార్ డైరక్టర్. ఓటీటీల హవా కొనసాగుతున్న నేపథ్యంలో కొరటాల లాంటి స్టార్ డైరెక్టర్స్ అటు వైపుగా దూసుకెళ్లే పయత్నం చేస్తున్నారు.