బాలయ్య టైటిల్ తో షారూక్ సినిమా

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తో కోలీవుడ్ దర్శకుడు అట్లీ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూణెలో ఈ సినిమా షెడ్యూల్ నడుస్తోంది. ఈ సినిమా కోసం ‘లయన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ టైటిల్ బాగుంది.. ఇదే టైటిల్ ని ఫైనల్ చేయాలని బాలీవుడ్ ప్రేక్షకులు కోరుతున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ లో ‘లయన్’ గా కనిపించి.. గర్జించాడు బాలయ్య. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన సింహా, లయన్ సినిమాలు బ్లాక్ బస్టర్  హిట్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో నుంచి లయన్ టైటిల్ ని షారుక్ ఖాన్ వాడుకోనున్నాడనే న్యూస్ తెలిసి.. బాలయ్య అభిమానులు ఖుషి అవుతున్నారు.
 ఇక షారుక్ సినిమాతో సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. అటు మరో హీరోయిన్ ప్రియమణి, చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీ తర్వాత షారూక్ సరసన మరోసారి నటిస్తోంది. 

లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా స్టార్ట్ చేసిన షారూక్, తన కొత్త ప్రాజెక్టు గురించి ఎలాంటి డీటెయిల్స్ బయటపెట్టడం లేదు. పూణెలోని ఓ మెట్రో స్టేషన్ లో షూటింగ్ చేయడానికి అనుమతి కోసం యూనిట్ లెటర్ రాసింది. అందులో తమ సినిమా పేరును లయన్ గా పేర్కొంది. అలా షారూక్-అట్లీ సినిమాకు లయన్ అనే పేరు పెట్టినట్టు బయటకొచ్చింది.