రాజు మృతిపై అనుమానాలు.. హైకోర్టులో పిల్ !

సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడి రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. రాజు గురువారం స్టేషన్ ఘన్పూర్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై మృతిచెందాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు భారీగా గాలిస్తుండగా ఈ ఘటన జరిగింది.
అయితే రాజు మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. తన కొడుకిని పోలీసులే చంపేశారని రాజు తల్లి వీరమ్మ ఆరోపించింది. తాజాగా రాజు మృతిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ దీన్ని దాఖలు చేశారు. రాజుది కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై ఈ మధ్యాహ్నం హైకోర్టు విచారణ చేపట్టనుంది.