టీమిండియా కోచ్ గా మళ్లీ కుంబ్లీ.. బీసీసీఐ ప్రయత్నాలు ?
టీ20 కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 ప్రపంచకప్ తర్వాత తప్పుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు ఈ పొట్టి ప్రపంచకప్ తర్వాత హెడ్‌కోచ్ రవిశాస్త్రి కాలపరిమితి కూడా పూర్తికానుంది. ఈ నేపథ్యంలో శాస్త్రీ స్థానంలో కోచ్ అనిల్ కుంబ్లేను తీసుకువచ్చేలా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
కుంబ్లే 2016-17 కాలంలో టీమ్‌ఇండియా కోచ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో క్రికెట్ అడ్వైజరీ కమిటిలో సచిన్, గంగూలీ, లక్ష్మణ్ సభ్యులుగా ఉన్నారు. వాళ్లే కుంబ్లేను ఎంపిక చేశారు. అయితే, కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కుంబ్లే ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు. అయితే ఇప్పుడు కుంబ్లేని మరోసారి కోచ్ గా తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారమ్. అలాగే టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ పేరు కూడా తెరపైకి రావడం గమనార్హం.