రికార్డు ధర పలికిన బాలాపూర్‌ లడ్డూ

బాలాపూర్‌ గణేశుడి లడ్డూకు ఉండే విశిష్టత గురించి తెలిసిందే. మరోసారి బాలాపూర్ రికార్డు ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌తో కలసి నాదర్‌గుల్‌ వాసి మర్రి శశాంక్‌రెడ్డి లడ్డూను రూ.18.90 లక్షలకు దక్కించుకున్నారు.1994 నుంచి బాలాపూర్‌ లడ్డూ వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ కారణంగా గతేడాది వేలంపాట జరగని విషయం తెలిసిందే. 2019లో బాలాపూర్‌ లడ్డూ రూ.17.60 లక్షలకు రాంరెడ్డి లడ్డూరు దక్కించుకున్నారు. ఈ ఏడాది లక్షకుపైగా అధిక ధర పలికింది.

‘తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని బాలాపూర్‌ లడ్డూ వేలంలో పాల్గొన్నా. శశాంక్‌రెడ్డితో కలిసి లడ్డూను దక్కించుకున్నా. సీఎం జగన్‌కు లడ్డూను కానుకగా ఇవ్వాలనే వేలంలో పాల్గొన్నానని ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌ అన్నారు. వేలంపాటలో స్థానికులైతే మరుసటి ఏడాది డబ్బు చెల్లించేలా నిబంధన ఉంది. అదే స్థానికేతురులైతే అప్పటికప్పుడు చెల్లించాలి.