టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. అందరికీ క్లీన్ చీట్ !
టాలీవుడ్ మత్తుమందుల కేసులో సినీ ప్రముఖులకు పూర్తిస్థాయిలో క్లీన్‌చిట్ లభించింది. 2017లో బహిర్గతమైన ఈ వ్యవహారంలో మొత్తం 12 కేసులు నమోదు చేసిన ఎక్సైజ్‌శాఖ అప్పట్లో పలువురు సినీ ప్రముఖులను విచారించినా ఏ ఒక్కరి పాత్రపైనా నిగ్గు తేల్చలేకపోయింది. దీంతో మొత్తం 12 కేసుల్లోనూ సినీ ప్రముఖులకు ఎలాంటి ప్రమేయం లేదని తేలినట్లయింది.
కీలక నిందితుడు కెల్విన్‌పై నమోదు చేసిన అభియోగ పత్రంలో పూరి, తరుణ్ రక్త నమూనాల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు లేవని పేర్కొనడంతోపాటు ఎఫ్‌ఎస్‌ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ వి.ఆర్.గుణశీల వాంగ్మూలాన్నీ నమోదు చేశారు. సినీ ప్రముఖులకు ఎక్సైజ్‌శాఖ క్లీన్‌చిట్ నేపథ్యంలో మనీలాండరింగ్ అంశం కింద ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జరుపుతున్న విచారణ ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది.