మంత్రి షేర్ని నానితో సినీ పెద్దల భేటీ.. ఏం చర్చిస్తున్నారంటే ?

ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ పెద్దలకు అపాయింట్ మెంట్ దొరికింది. కానీ సీఎం జగన్ తో కాదు. మంత్రి షేర్ని నానితో సినీ పెద్దలు సమావేశం అయ్యారు.  ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, సి.కల్యాణ్‌, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌ టిక్కెట్ల వ్యవహారంపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. థియేటర్స్ లో వందశాతం ఆక్యుపెన్సీ ఇవ్వాలని సినీ పెద్దలు కోరుతున్నట్టు తెలిసింది. మరోవైపు, తెలుగు చిత్రపరిశ్రమను ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ ఆదివారం సాయంత్రం ఓ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో చిరంజీవి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.