కోహ్లీ టైమింగ్ ఏమీ బాగులేదు

టీ20 ప్రపంచకప్‌ తర్వాత.. భారత జట్టు పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటానని ఇటీవల చెప్పిన విరాట్‌ కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి మరో సడెన్ షాక్ ఇచ్చాడు విరాట్. ఆర్సీబీ సారథిగానూ తనకు ఈ సీజనే ఆఖరిదని తెలిపాడు.

కోహ్లీ నిర్ణయంపై గంభీర్‌ స్పందించాడు ‘సరిగ్గా రెండో దశ ప్రారంభమైనప్పుడే కోహ్లీ ఇలా ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. ఒకవేళ కచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే టోర్నీ పూర్తయ్యాక చెప్పాల్సింది. ఎందుకంటే ఇప్పుడీ నిర్ణయం జట్టుపై ప్రభావం చూపుతుంది. కోహ్లీ కోసం ట్రోఫీ సాధించాలని ఆటగాళ్లపై ఒత్తిడి నెలకొంటుంది. ప్రస్తుతం ఆర్సీబీ చాలా మంచి స్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ నిర్ణయంతో వాళ్లని అనవసర ఒత్తిడికి గురిచేయడం ఎందుకు? నిజంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని భావిస్తే టోర్నమెంట్‌ పూర్తయ్యాక కూడా చెప్పొచ్చు. కోహ్లీ టైమింగ్ ఏమాత్రం బాగులేదు’ అని గంభీర్‌ అన్నారు.